విజయ్ సేతుపతికి ధన్యవాదాలు తెలుపుకున్న షారుఖ్ ఖాన్

by samatah |   ( Updated:2023-07-12 12:37:56.0  )
విజయ్ సేతుపతికి ధన్యవాదాలు తెలుపుకున్న షారుఖ్ ఖాన్
X

దిశ, సినిమా:బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లాంగ్ గ్యాప్‌ తర్వాత ‘పఠాన్‌’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీ ‘జవాన్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, నయనతార ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌ మాములుగా లేదు. పైగా ఇందులో షారుఖ్ ప్రతినాయకుడా లేక హీరోనా అనే డౌట్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇకపోతే తాజాగా షారుఖ్.. నటుడు విజయ్ సేతుపతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయ్ సార్ మీతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సెట్స్‌లో నాకు కొంచెం తమిళం నేర్పినందుకు, రుచికరమైన ఆహారాన్ని పంచినందుకు ధన్యవాదాలు. లవ్ యు నన్బా!’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: పిల్లల కోసం నా భర్తతో 14 సార్లు ప్రయత్నించా.. కానీ సల్మాన్ ఖాన్ వల్ల తల్లినయ్యా : Kashmera Shah

Advertisement

Next Story

Most Viewed