విలన్స్‌గా షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్?

by sudharani |
విలన్స్‌గా షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘ధూమ్’ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ మూడు భాగాలుగా రాగా.. అన్ని బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ‘ధూమ్-4’ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఫ‌స్ట్ పార్ట్‌లో జాన్ అబ్రహాం విలన్‌గా న‌టించ‌గా.. సెకండ్ పార్ట్‌లో హృతిక్ రోష‌న్, థ‌ర్డ్ పార్ట్‌లో ఆమీర్ ఖాన్ న‌టించగా.. మూడు పార్ట్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు ‘ధూమ్ 4’ తెరకెక్కించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుండగా.. పార్ట్ 4లో విల‌న్‌గా సూర్య న‌టించ‌బోతున్నట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పడు ఈ వార్తలకు చెక్ పెడుతూ.. ధూమ్-4లో నటించే పాత్రలపై బాలీవుడ్ నుంచి క్రేజీ కాంబో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ‘ధూమ్-4’లో విల‌న్స్‌గా బాలీవుడ్ బాద్‌షా షారుక్‌తో పాటు ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించ‌బోతున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆదిత్య చోప్రా రణ్‌బీర్‌ను సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఒకే సినిమాలో షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ కలిసి నటిస్తున్నారనే వార్త ప్రజెంట్ నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed