షారుఖ్‌కు మహిళా బాడీగార్డ్‌లు.. బలమైన కారణం ఉంది!!

by Mahesh |
షారుఖ్‌కు మహిళా బాడీగార్డ్‌లు.. బలమైన కారణం ఉంది!!
X

దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది మహిళా అభిమానులు ఉన్నారు. అందులో ఎక్కువ భాగం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి రొమాంటిక్ చిత్రాల్లో అతడు పోషించిన పాత్రలకు ఫిదా అయినవారే ఉన్నారు. ఇదిలావుంటే.. సాధారణంగా హీరోహీరోయిన్లకు పురుషులు బాడీగార్డ్‌లుగా ఉంటారు. కానీ బాద్ షాకు మాత్రం మహిళా బాడీగార్డ్స్ ఉన్న సంగతి చాలా మందికి తెలియదు.

కానీ, ఈ విషయాన్ని ‘ఇండియన్ టుడే కాన్‌క్లేవ్‌’ ఈవెంట్‌లో పాల్గొన్నపుడు స్వయంగా వెల్లడించిన షారుఖ్.. ‘నాకు రక్షణగా ఉన్న పురుషులు మహిళా అభిమానులను నెట్టివేయడం మొరటుగా అనిపించింది. ఇది అసభ్యకరమైనదే కాదు భయంగానూ కనిపించింది. నన్ను ఇష్టపడే మహిళలు చాలా మంది నన్ను కలిసేందుకు కష్టపడతారు. కాబట్టి వాళ్లందరికోసం నేను లేడీ బాడీగార్డ్‌లను ఎంచుకున్నా. నాపై అమ్మాయిలు చూపించే ప్రేమను కాదనడం బాధిస్తుంది’ అంటూ పలు విషయాలు వివరించాడు.

Advertisement

Next Story