- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవార్డులంటే చాలా ఇష్టం.. అందుకోసమే కష్టపడతా: Shah Rukh khan
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ప్రముఖ ఈవెంట్‌లో అవార్డులు అందుకోవడాన్ని గొప్పగా ఫీల్ అవుతానంటున్నాడు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన 'రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్'లో అతని విశేష కృషిని గుర్తించి గౌరవ పురస్కారాన్ని అందించారు నిర్వాహకులు. అయితే ఈ బహుమానం అందుకోవడంపై రీసెంట్‌గా స్పందించిన షారుఖ్.. 32 ఏళ్లుగా ప్రజలను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పాడు. ఇందులో భాగంగా పొందే అవార్డ్స్‌ను మనస్పూర్తిగా స్వీకరిస్తానని చెప్పాడు. అంతేకాదు తన పని కేవలం వ్యక్తిగత పేరు కోసం కాదన్న ఆయన.. భారతదేశ చలనచిత్ర పరిశ్రమ కోసం కష్టపడుతూ ప్రస్తుతం తానొక కీలక వ్యక్తిగా మారినందుకు గర్వంగా ఉందన్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు తనతోపాటు ఎంతోమంది విశేష కృషి చేశారని.. అలాంటి వారిని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని తెలిపాడు.
Also Read...
పెళ్లి తర్వాత నా జీవితానికి అర్థం లేకుండా పోయింది: స్టార్ నటి
- Tags
- Shah Rukh Khan