- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'Shakunthalam' డిజిటల్ రైట్స్ సొంతంచేసుకున్న ప్రముఖ OTT సంస్థ ?

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన తాజా చిత్రం 'శాకుంతలం'. డైరెక్టర్ గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ ఫిబ్రవరి 17న విడుదలకానుంది. కాగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉండటంతో మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. సినిమా రిలీజ్‌కు ముందే మూవీ డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సినిమాకు సంబంధించిన హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక మలయాళ నటుడు దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, గౌతమి, అనన్య నాగళ్ల, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించిన చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదలకానుంది.
ఇవి కూడా చదవండి : KL Rahul-Athiya Shetty వివాహానికి సర్వం సిద్ధం