సెన్సేషనల్ న్యూస్.. నటి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం

by sudharani |   ( Updated:2024-05-11 14:29:34.0  )
సెన్సేషనల్ న్యూస్.. నటి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటీనటుల మరణాలు పెద్ద మిస్టరీగా ఉండిపోయాయి. వీటిలో నటి లైలా ఖాన్ ఒకరు. 1978లో ముంబైలో పుట్టి పెరిగిన లైలా.. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రాజేష్ ఖన్నాతో నటించిన ‘వాఫా’ అనే మూవీతో మరింత క్రేజ్ పెంచుకుంది. దీంతో వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణించేది. ఈ క్రమంలోనే 2011లో జిన్నాతో సినిమా చేస్తున్న సమయంలో.. షూటింగ్‌కు కాస్త బ్రేక్ రావడంతో ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లింది. మరల తిరిగి రాలేదు. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది. అయితే.. ఈ కేసులో పలు ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక ఫ్యామిలీతో సహ లైలా మిస్ కావడంతో ఆమె తండ్రి నాదిర్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించగా.. అక్కడ ఆమెకు ఫామ్ హౌస్ ఉందని తెలిసి వెళ్లారు. అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇక కొన్ని నెలలకు కాశ్మీర్ ప్రాంతంలో వీరి వాహనం దొరకడంతో కేసు మరింత కష్టంగా మారింది. లైలా కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది.

అయితే.. పోలీసులకు లైలా సవతి తండ్రైనా పర్వేజ్ తక్‌పై అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్తి విషయంలో గొడవ జరగడంతో ముందుగా భార్య షెలీనాను చంపి.. ఆ తర్వాత లైలా, ఆమె అక్క అమీనాతో సహా మిగిలిన అందరినీ హత్య చేసినట్లు తెలిపాడు. ఆ మృతదేహాలు ఎక్కడ పెట్టాడో చెప్పడంతో.. పోలీసులు కుళ్లిపోయిన మృతదేహాలను వెలికితీశారు. అయితే.. ఈ కేసులో అప్పటి నుంచి విచారణ జరగ్గా.. తాజాగా ముంబాయి సెషన్ కోర్టు పర్వేజ్ తక్‌ను దోషిగా తేల్చింది. అంతే కాకుండా మరో రెండు రోజుల్లో అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది కోర్టు.

Read More...

అతిలోక సుందరికి అరుదైన గౌరవం.. ముంబైలోని ఓ వీధికి శ్రీదేవి పేరు

Advertisement

Next Story