Megastar Chiranjeevi కూతురు సంచలన వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2022-12-06 07:23:10.0  )
Megastar Chiranjeevi  కూతురు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతరు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీజా తాజాగా సోషల్ మీడియా వేదికగా, తన పిల్లలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తన పిల్లలు తన మాట విని తాను చెప్పిన దారిలోనే వెళ్లాల్సిన అవసరం లేదని, కేవలం క్రమశిక్షణతో పెంచుతానంది. అలాగే వారికి ఏది తప్పో, ఏది ఒప్పో లాంటి విషయాలు చెబుతానని తెలిపింది. తాను మాట్లాడుతూ.. తన చిన్న పాప నవిష్క చాలా అల్లరిపిల్ల అని, పెద్ద కూతురు నివృతి మాత్రం చాలా సైలెంట్ అని తెలియజేసింది. పిల్లలకు గారాబం ఎక్కువ చేస్తే చెడిపోతారని అందువలన తమ పిల్లలకు అప్పుడప్పుడు సీరియస్ వార్నింగ్‌లు ఇస్తానంది. తనను తన తండ్రి ఎక్కువ గారాబం చేసినప్పటికీ, క్రమశిక్షణతో మెలగడం నేర్పరని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శ్రీజ చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : వెంకటేష్ కూతురితో నాగచైతన్య.. తెరపైకి మరో కొత్త అంశం!

Advertisement

Next Story