- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష్మీ పార్వతి మా కుటుంబంలోకి వచ్చిన శని మంచి ఆడది కాదు.. ఎన్టీఆర్ మనవడు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా లక్ష్మీ పార్వతి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘అనకూడదు కానీ.. లక్ష్మీ పార్వతి రావడం వల్ల మాకు మంచి జరగలేదు. ప్రతిదానిలో ఇంటర్‌ఫియర్ అవుతుంది తను. ఆ సమయంలో పార్టీని లాగేసుకునే పనిలో ఉంది. అనకూడదు కానీ.. మా ఫ్యామిలీలోకి ఒక శని వచ్చింది. నేను డైరెక్ట్‌గా చెప్తాను. చాలా మంది మావయ్య చంద్రబాబు మీద కామెంట్లు చేస్తున్నారు. అవి నిజం కాదు. పార్టీని కాపాడడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు మావయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనే కాదు.. మొత్తం ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మా బాబాయ్‌లు బాలకృష్ణ, హరికృష్ణ, వెంకటేశ్వరరావు మావయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపాడు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టేకోవర్ చేసుకోవడంపై చైతన్య కృష్ణ మాట్లాడాడు. ‘ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఎదురు తిగినప్పుడు నాన్న చిన్నాన్న జయశంకర్ కృష్ణ మా తాతయ్యకు అండగా నిలబడ్డారు. లక్ష్మీ పార్వతి అంటే మా నాన్నకు కూడా ఇష్టం లేదు. ఓపెన్‌గా చెప్పాలంటే.. ఆమె మంచి ఆడది కాదు. క్యారెక్టర్ లెస్ లేడీ. ఒక శని మా ఇంటికి వచ్చింది. కానీ, పాపం మా తాతగారు ఒంటరి అయిపోయారు. ఆ తప్పని పరిస్థితుల్లో మా నాన్న, జయశంకర్ కృష్ణ మా తాతగారికి సపోర్ట్ చేశారు. కానీ, లక్ష్మీ పార్వతికి కాదు. అయితే, పార్టీని కాపాడాలి.. విధివిధానాలు ఉన్న మంచి పార్టీ.. అలాంటి పార్టీ ఆమె వల్ల సర్వనాశనం అయిపోతుందని ఎమ్మెల్యేలంతా చంద్రబాబు మావయ్యకి సపోర్ట్ చేశారు. లీగల్‌గా రూల్స్ ప్రకారం చూసుకుంటే అత్యధిక శాతం ఎమ్మెల్యేలు ఉన్నవారే సీఎం. అలా మావయ్య సీఎం అయ్యారు. ఇది వెన్నుపోటు కాదు’ అని చైతన్య కృష్ణ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం చైతన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.