- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Heroine Raasi : ప్రభాస్ ‘కల్కి’ మూవీ వాళ్లకే బాగా నచ్చుతుందంటూ సీనియర్ హీరోయిన్ రాశి ఆసక్తికర కామెంట్స్
దిశ,సినిమా: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ "కల్కి 2898 ఏడి" ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించింది. మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి బిగెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ప్రేక్షకులతో పాటు సినీ సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.
ఇక తాజాగా, సీనియర్ హీరోయిన్ రాశి ‘కల్కి’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కల్కి మూవీని చూశానని తెలిపింది. “ మా పాపతో ఈ మూవీని చూశాం. తను అయితే, 3D గ్లాసెస్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. పెద్దల కంటే ఈ సినిమా పిల్లలకు బాగా నచ్చుతుంది. సినిమాలో ప్రభాస్ అద్భుతంగ నటించాడు. భైరవ పాత్ర ప్రభాస్ తప్ప ఎవరూ చేయలేరు. ఇప్పుడు అర్ధమవుతుంది నాగ్ అశ్విన్ ఎందుకు ఇంత టైం తీసుకున్నాడనేది.. క్లైమాక్స్ లో అయితే ఎవరూ ఊహించలేని ట్విస్ట్ ఇచ్చి సినిమా చూస్తున్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు” అని అభినందించింది. అలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా ముఖ్యమైనది. కమల్ హాసన్ కూడా బాగా నటించాడు ఒక రకంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ ఈ మూవీకి బ్యాక్ బోన్ , కమల్ హాసన్ గెటప్ ప్రతీ ఒక్కర్ని ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చింది. ఈ అందాల తార చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.