- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితం ఇంతేనేమో ఇక.. గుడిలో ప్రసాదాలు తింటూ బతుకుతా.. నటి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సహ నటిగా పాత్రకు తగ్గట్టుగా నటించి టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది జయలలిత. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పర్సనల్, సినీ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘గతం తలుచుకుని చాలా బాధపడతాను. జీవితం ఇంతేనేమో ఇక అని సర్ది చెప్పుకుంటాను. నాకు డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను ఎప్పుడూ నెగిటివ్‌గా పేరు తెచ్చుకోలేదు. నా పేరు లలిత.. కాబట్టి జయలలిత అని పిలిచేవారు. ఆ పేరే నాకు మైనస్ అని, పేరు మార్చుకోమని చాలా మంది బెదిరించారు. కానీ.. నేను నా పేరును మార్చుకోలేదు. నా డాన్స్ లైఫ్ పోయింది. శంకరాభరణంలో మంజు భార్గవికి వచ్చిన తరహా పాత్ర నాకు వచ్చి ఉంటే బాగుండేది. నాకు కష్టం వచ్చినప్పుడు నా ఫ్రెండ్ నాగేంద్ర అనే వ్యక్తి ఎన్నోసార్లు సహాయం చేశాడు. భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది లేదు. చాలా ఆశ్రమాలు, గుళ్లు ఉన్నాయి. వాటిని శుభ్రం చేస్తూ.. ప్రసాదాలు పెడితే వాటిని తింటూ బతికేస్తా’’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా.. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు త్వరలో మీకు ఛాన్స్‌లు వచ్చి బిజీగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read..
సినిమా షూటింగ్ సమయంలో ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోమన్నారు.. బాలీవుడ్ నటి వైరల్ కామెంట్స్