అన్నయ్య ముందే బట్టలు విప్పి చూపించమనేది.. షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి!

by Jakkula Samataha |   ( Updated:2024-06-04 10:05:44.0  )
అన్నయ్య ముందే బట్టలు విప్పి చూపించమనేది.. షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి!
X

దిశ, సినిమా : సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించింది. అంతే కాకుండా సెకండ్ ఇన్నిగ్స్‌లో కూడా వెండితెరపై పలు సినిమాల్లో చేసింది. అలాగే బుల్లితెరపై పలు షోల్లో సందడి చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పై తన అనుభవాలను పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఇబ్బందులు ఉండేవి కామన్, అలనాటి తార సావిత్రి కాలం నుంచి హీరోయిన్స్ సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వలన ప్రతి ఒక్కటీ బయటకు వస్తుంది. అంతే కాకుండా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. ప్రొఫెషన్‌లో మంచి చెడు రెండూ ఉంటాయి. కష్టాలను దాటుకొనే స్టార్‌గా ఎదుగుతారు. నేను తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నాను. కొందరైతే ఏకంగా నన్ను మా అన్నయ్య, అమ్మ ముందే డ్రెస్ తీసి చూపించమని చెప్పారు. ఆరోజులు గుర్తుకు వస్తే భయం వేస్తుంటది. ఆ మాటలు విని లేచి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయంటూ ఓపెన్ అయ్యింది. అలాగే మీటూ మూమెంట్‌లో తాను లేను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సీనియర్ నటి ఆమని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed