- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ తమ్ముడితో సంసారం చేయలేను.. మలైకా బాటలోనే సీమ
దిశ, సినిమా: ప్రముఖ సీనియర్ నటి సీమా సజ్‌దే.. భర్త సోహైల్ ఖాన్‌తో విడాకుల ఇష్యూపై స్పందించింది. 2017 నుంచి ఆయనతో దూరంగా ఉంటున్న నటి ఇటీవల డివోర్స్ కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 24 ఏళ్ల వివాహ బంధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకడం చాలా ముఖ్యమని భావిస్తున్నట్లుగా తెలిపింది. అంతేకాదు మిగిలిన జీవితాన్ని సోహైల్‌తో పంచుకోవడం అస్సలు ఇష్టంలేదన్న ఆమె గడిచిన కాలాన్ని చీకటితో కూడిన అగాథంగా పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇకపై అతని ముందు లొంగిబతకడం తనవల్ల కాదని స్పష్టం చేసిన సీమ.. 'నా జీవితాన్ని పూర్తిగా సానుకూల కోణం నుంచి చూస్తున్నా. నా లైఫ్‌లో చోటుచేసుకున్న ప్రతికూలతను వదిలేశా. ఇకపై కూడా అలాంటివి పట్టించుకోను. నేను ఎలా ఉంటానో నా కుటుంబం, తోబుట్టువులు, పిల్లలకు బాగా తెలుసు' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇరు కుటుంబాలు పెళ్లికి నిరాకరించినప్పటికీ 1998లో ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్న ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు.