ఆ వారసులను చూసి తెలుసుకోండి.. అల్లు అర్జున్‌పై హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్!

by Hamsa |   ( Updated:2024-08-23 14:30:36.0  )
ఆ వారసులను చూసి తెలుసుకోండి.. అల్లు అర్జున్‌పై హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున మధ్య వివాదం నడుస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి ఎన్నో రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక మెగా, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, వీరిద్దరి వివాదంపై ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకి పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ రేఖా భోజ్ రియాక్ట్ అవుతూ ఫేస్‌బుక్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మరీ అంతలా ఎగిరి పడకండి సార్. స్వయం ప్రకటిత స్టార్.. ఈ రోజు ఉదయం టీవీలో అలా చానల్స్ తిప్పుతుంటే ఒక దగ్గర పరమానందయ్య శిష్యుల కథ వస్తుంటే ఆపి చూశా. శిష్యులుగా చేసిన పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, సారథి, పూర్ణచంద్ర రావు ఇంకా మిగిలిన వారి పేర్లు తెలియదు. బొద్దపాటి అని గూగుల్ లో ఉంది కానీ ఆయన శిష్యుడిగా చేయలేదు అందులో అని మా నానమ్మ చెప్పింది. పూర్ణ చంద్ర రావు అనే పేరు కూడా ఆవిడే చెప్పింది. వీళ్లంతా అప్పట్లో ప్రముఖ కమెడియన్స్. ఇంకా వీళ్లే కాకుండా తెలుగులో ఇంకొంత మంది ప్రముఖ కమెడియన్స్ ఉన్నారు. రేలంగి, రమణా రెడ్డి, అంజి బాలకృష్ణ, వంగర, ఇంకా కొందరి పేర్లు మిస్ అయి ఉంటే క్షమించాలి. ఇలా అల్లు రామలింగయ్య గారితో సమకాలికులుగా ఉన్న కమెడియన్స్ లో ఆయన కంటే కూడా గొప్ప పేరున్న వారున్నారు ఇందులో కొందరు. వీరిలో చాలామందికి సినిమా నుంచి కలర్ లోకి వచ్చాక వేషాలు తగ్గిపోయాయి.

కానీ అల్లు మాత్రం చచ్చేదాకా ఆగలేదు. ఎందుకూ?... ఇంకా వారిలో చాలా మంది పేర్లు ఈ జనరేషన్ కు తెలియదు. బయట రోడ్డు పైకి వెళ్లి ఈ జనరేషన్ పిల్లలను వీరి పేర్లు అడిగితే తెలియదు అంటారు. కానీ అల్లు రామలింగయ్య పేరు అడిగితే 90% పీపుల్ తెలుసు అంటారు. ఎందుకూ?.. అంతే కాకుండా అలనాటి ప్రముఖ కమెడియన్స్ అందరి వారసులు ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు ఎవరో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కానీ ఆల్లు రామలింగయ్య వారసుడు అల్లు అరవింద్, ఆయన మనవళ్ళు అందరూ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నారు. ఎందుకూ..? బాబూ! పుష్ప స్టార్ ఫ్యాన్స్ , ఇప్పుడు చెప్పండి, ఎవరి లైఫ్ లోకి ఎవరు వస్తే ఎవరి జీవితాలు బాగుపడ్డాయో.. ఆయన మీతో చుట్టరికం చేయడమే కాకుండా తన ప్రేమ, స్నేహాన్ని పంచుతూ ఏటువంటి పక్షపాతం లేకుండా పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ తో పాటుగా నిస్వార్థంగా తన లెగసీని ( వారసత్వాన్ని) మీకు కూడా ఇచ్చాడు. మీరు నిలబడేదాక మీతో వారు నిలబడ్డారు. మీరు కాస్త నిలదొక్కుకునే దాకా మీ ఫంక్షన్స్ అన్నింటికీ ఆయన గానీ, పవన్ కళ్యాణ్ కానీ వచ్చారు. ఆయన మొహం చూసి ఆయన కుటుంబంలోని స్టార్స్, ఆయనని ప్రాణంగా భావించే ఫ్యాన్స్ కూడా మీకు సపోర్ట్ గా.. ఇంకా గట్టిగా చెప్పాలంటే వీడు మావోడు అని మొదటి సినిమా నుంచే కోట్ల మంది అండగా నిబడ్డారు.

ఇప్పుడు మీ తరపున మెగా ఫ్యామిలీనీ, ఫ్యాన్స్ నీ తిడుతున్న వాళ్ళలో ఒక్కడైనా నీ మొదటి సినిమాని థియేటర్లో చూసాడేమో కనుక్కోండి. కానీ మీరు మాత్రం ఆయనతో, ఆయన అభిమానులతో వ్యాపారం చేశారు. ఇక ఈయనతో, ఈ ఫ్యామిలీతో వ్యాపారం లేదు అని పూర్తిగా క్లారిటీ వచ్చాక మీ రియాలిటీ బయటకు తీశారు. మెగాస్టార్ అనేవాడు లేకపోతే మీరంతా ఎక్కడ ఉండేవారో ఒక్కసారి ఇతర కమెడియన్స్ వారసులను చూసి తెలుసుకోండి. వారిలాగా మీ పేర్లు, అడ్రస్ లు కూడా మాకు ఈ రోజున తెలిసి ఉండేవి కావు. మీరంతా ఒకసారి కింద వీడియో చూడండి అది చదివాక. ఒకప్పుడు మీ మీ హీరో ఎలా ఉన్నాడో , ఏమన్నాడో చూడండి. మీరు కూడా ఆలోచించండి ఆ ఫ్యాన్స్ నేను చెప్పింది నిజమా కాదా? Note : ఎవరినీ కించ పరచడానికి రాయలేదు. జస్ట్ ఫాక్ట్స్ చెప్పాలని రాశాను. ఇతర కమెడియన్స్ వారసులెవరూ ఇప్పుడు బాలేరని నా ఉద్దేశం కాదు. వారు ఎవరో ప్రస్తుతం సినీ ప్రేక్షకులకు తెలియదు అన్న పాయింట్ వరకే ఇది వర్తిస్తుంది’’ అని రాసుకొచ్చింది. ఇక దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed