అతనే నా రాజకుమారుడు అంటూ.. ఆ స్టార్ హీరో పేరు చెప్పేసిన SreeLeela

by Prasanna |   ( Updated:2023-10-06 09:40:28.0  )
అతనే నా రాజకుమారుడు అంటూ.. ఆ స్టార్ హీరో పేరు చెప్పేసిన SreeLeela
X

దిశ,వెబ్ డెస్క్: శ్రీలీల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే ఈ అమ్మడు ఏ సినిమా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. చిన్న హీరోల నుంచి తన కెరియర్ని మొదలు పెట్టి స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా శ్రీలీల మ్యాడ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా హాజరైంది. ఆ ఫంక్షన్లో తనకు బాగా ఇష్టమైన హీరో గురించి తెలిపింది.ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు శ్రీలీలతోపాటు సిద్దూజొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడుతూ.. తన అభిమాన హీరో దుల్కర్ సల్మాన్ అని బయటకు చెప్పేసింది. సార్ మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పినప్పుడు మా అమ్మ చాలా సంతోషించింది. మిమ్మల్ని అడిగాను అని చెప్పమంది సార్ అంటూ తెలిపింది. “నాకు చిన్నప్పుడు ఒక కల వచ్చేది. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు.. గుర్రం మీద వస్తున్న ఒక యువరాజుని ఊహించుకున్నాను, మీ ‘హీరేయ్’ పాట చూసిన ప్రతి సారి.. మీరే నా రాకుమారుడని అనుకున్నాను అంటూ శ్రీలీల ఓపెన్ గా చెప్పేసింది. దాంతో మన హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ చిన్నగా నవ్వి, థాంక్స్ అని చెప్పాడు.

Read More..

సెక్సీగా ఉండటానికి శరీరం కాదు అది కూడా ఉండాలంటూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్..! పోస్ట్ వైరల్

Advertisement

Next Story