సెట్‌లో నటిపై లైంగిక దాడి.. దర్శకనిర్మాతల మద్దతుతో రెచ్చిపోయిన కొరియో‌గ్రాఫర్‌

by Prasanna |   ( Updated:2023-09-19 10:01:28.0  )
సెట్‌లో నటిపై లైంగిక దాడి.. దర్శకనిర్మాతల మద్దతుతో రెచ్చిపోయిన కొరియో‌గ్రాఫర్‌
X

దిశ, సినిమా: ప్రముఖ కొరియోగ్రాఫర్ అనుమతి లేకుండా తనను అసభ్యంగా తాకినట్లు బెంగాలీ నటి సాయంతికా బెనర్జీ ఆరోపించింది. తన అప్ కమింగ్ మూవీ ‘ఛాయాబాజ్’ షూటింగ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ వెళ్లిన ఆమె.. ఈ ఊహించని ఘటన జరగడంతో ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే కొద్దిరోజులుగా దీనిపై మౌనంగా ఉన్న సాయంతిక.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. కమ్రుల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో జయేద్ ఖాన్‌కు జోడీగా నటిస్తున్న ఆమె.. ‘సినిమా సెట్స్‌లో మేనేజ్‌మెంట్‌తో అనేక సమస్యలు తలెత్తాయి. దీంతో నిరాశకు గురయ్యా. షూటింగ్ సమయంలో మైఖేల్ అనుమతి లేకుండా నా శరీరాన్ని తాకడానికి ట్రై చేశాడు. ప్రశ్నిస్తే పనిలో భాగమని బెదిరించాడు. సెట్‌లో జరిగిన వివాదం గురించి నిర్మాతకు తెలియజేయడానికి ప్రయత్నించాను. కానీ ఫలితం లేకుండా పోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఘటనపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు.

Advertisement

Next Story