అప్పుడే మొదలైన ఆస్తి గొడవలు.. శరత్ బాబు ఆస్తులు ఆ 13 కుటుంబాలకే..!

by sudharani |   ( Updated:2023-05-24 14:34:31.0  )
అప్పుడే మొదలైన ఆస్తి గొడవలు.. శరత్ బాబు ఆస్తులు ఆ 13 కుటుంబాలకే..!
X

దిశ, వెబ్‌డెస్క్: వెండితెరపై వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ నటుడు శరత్ బాబు (71) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆయన మృతిపట్ల పలువురు నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సంతానం తెలియజేశారు. ఇదిలా ఉంటే.. శరత్ బాబు మరణించి మూడు రోజులు కూడా గడవక ముందే ఆయన ఆస్తి గురించి కుటుంబంలో గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శరత్ బాబుకు రెండు పెళ్లిళ్లు అయినప్పటికీ ఆయనకు పిల్లలు లేరు.

ఈ నేపథ్యంలోనే తన సోదరి సోదరుల పిల్లలకు దాదాపుగా 13 వాటాల ఆస్తులను పంచనున్నట్లు సమాచారం. ఇలా వారి వాట వారికి ఇచ్చిన ఇంకా ఆయన పేరిట ఆస్తులు ఉన్నాయట. ఇప్పుడు ఆ ఆస్తుల విషయంలో కూడా కుటుంబంలో గొడవలు వస్తున్నాయట. ఇక శరత్ బాబు బతికుండగానే మొదలైన ఆస్తి గొడవలు ఆయన చనిపోయాక మరింత ఎక్కువయ్యాయట. అయితే ఆయనకు ఉన్న చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నగరాల్లో ఖరీదైన భవనాలతో పాటు ఎంతో విలువ చేసే మాల్స్, విల్లాలు 13 కుటుంభాలకు చెందనున్నట్లు సమాచారం. ఒకవైపు శరత్ బాబు మరణంతో బాధపడుతుంటే మరోవైపు ఆస్తి గొడవలు ఆయన అభిమానులను కలచి వేస్తున్నాయి.

Also Read..

‘టైగర్ నాగేశ్వరరావు’తో రవితేజ అభిమానుల ఆకలి తీరుస్తాం: డైరెక్టర్ వంశీ

Advertisement

Next Story