ఇందులో భాగం అయినందుకు నేను చాలా గర్వపడుతున్నా.. సారా టెంటూల్కర్ పోస్ట్ వైరల్

by sudharani |
ఇందులో భాగం అయినందుకు నేను చాలా గర్వపడుతున్నా.. సారా టెంటూల్కర్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: సారా టెండూల్కర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్‌తో అభిమానుల ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీకి.. స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ ఫొటో షేర్ చేసిన అది క్షణాల్లో వైరల్ కావడంతో పాటు లక్షల్లో లైక్స్ కూడా వస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా సారా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రశంసలు అందుకుంటుంది.

పేద విద్యార్థులకు చదువు అందించమే లక్ష్యాంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ‘సచిన్ టెండూల్కర్’ పేరిట కొన్ని ఫౌండేషన్‌లు దేశంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. తాజాగా ఇందులో భాగమైన సారా.. పిల్లలకు భోదిస్తూ వారికి కబుర్లు చెబుతూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అంతే కాకుండా ‘నేను నా జీవితంలో మొదటి సంవత్సరం మాత్రమే మా తాతతో గడపవలసి వచ్చినప్పటికీ, నేను అతని గురించి, అతని విద్య పట్ల మక్కువ గురించి అనేక కథలు వింటూ పెరిగాను. ప్రొఫెసర్‌గా, అపరిమిత అవకాశాలకు దారి చూపించే శక్తి విద్యకు ఉందని అతను నమ్మాడు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఉన్న సేవా కుటీర్‌కు మా సందర్శన ఆయన ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థమైంది. విద్యతో పాటు, STF ద్వారా సేవా కుటీర్‌లు పిల్లలకు రోజుకు రెండుసార్లు పోషకమైన భోజనాన్ని అందిస్తాయి. అలాగే స్థానిక సమాజానికి ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి. STFలో భాగమైనందుకు నేను ఎందుకు గర్వపడుతున్నానో ఇక్కడ సంఘం మద్దతు ప్రభావం నాకు నిజంగా గుర్తు చేసింది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed