- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మరోసారి బయటపడ్డ సారా టెండూల్కర్ - శుభ్‌మన్ గిల్ సీక్రెట్ లవ్.. త్వరలో పెళ్లి.. సాక్ష్యం ఇదే!
దిశ, సినిమా: భారత స్టార్ క్రికెటర్ సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సారా.. యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రేమ వ్యవహారంతో సారా ఏదో ఒక వార్తతో తరచూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంటుంది. వీరిద్దరు సీక్రెట్‌గా రిలేషన్‌షిప్ మెటైంట్ చేస్తున్నట్లు టాక్.
రీసెంట్ గా యూఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి.. సారా-గిల్ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో నెట్టింట కొద్ది రోజుల వరకు వీరి వార్తలే ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా సారా టెండూల్కర్ నెట్టింట పంచుకున్న కొన్ని ఫోటోలతో వీరి లవ్ మరోసారి బయటపడింది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పార్టీకి వెళ్లిన సారా టెండూల్కర్, ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి కొన్ని పార్టీల్లో పాల్గొంది.
ఈ సందర్భంగా సారా రెడ్ కలర్ లెహంగాలో మెరిసింది. ఇక్కడ సారా కంటే తన పక్కనున్న పెంపుడు కుక్కే హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ పెట్ డాగ్ శుభ్ మన్ గిల్ దగ్గర ఉన్న కొన్ని పెంపుడు కుక్కల్లో ఒకటి అట. కొన్ని నెలల క్రితం ఇదే డాగ్ ఫొటోను శుబ్‌మన్ మిస్ అవుతున్నానంటూ పోస్ట్ చేశారు. అప్పుడు ఈ కుక్క చనిపోయిందేమో అందుకే గిల్ ఈ పోస్ట్ పెట్టారనుకున్నారు జనాలు.
కానీ ఈ డాగ్ సారా దగ్గర ఉంది. శుభ్ మన్ గిల్ కు ఎంతో ఇష్టమైన తన పెట్ డాగ్‌ను సారా టెండూల్కర్‌కి ప్రేమ కానుకగా ఇచ్చి ఉంటాడని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కచ్చితంగా ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంతకన్నా సాక్ష్యం ఇంకొకటి ఉంటుందా? అంటూ జనాలు సారా-గిల్ పై కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
అలియా భట్-రణబీర్ కుమార్తె క్యూట్ వీడియో వైరల్.. ఎంత ముద్దొస్తుందో..!!