- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హద్దులు లేకుండా నటించడమే నాకు ఇష్టం.. యంగ్ బ్యూటీ
దిశ, సినిమా : కన్నడ బ్యూటీ సప్తమి గౌడ తన నటన జీవితంలో హద్దులేమి పెట్టుకో లేదంటోంది. ఇటీవల వచ్చిన 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిన నటి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కారణంగా చిత్ర పరిశ్రమలో కూడా భాషా సరిహద్దులు చెరిగిపోయాయని చెప్పింది. అలాగే 'కాంతారా' సినిమాకి విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడమే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందని తెలిపింది. 'ఈ ప్రాజెక్టు కోసం నన్ను సంప్రదించినప్పుడు స్టోరీ, పాత్రకు సంబంధించిన ఏ విషయంపై క్లారిటీ లేదు. కానీ, నాపై నమ్మకం ఉంచి హీరోయిన్‌గా నన్ను ఎంపిక చేసుకున్న హీరో, దర్శకుడు రిషబ్ శెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ భాషల్లో అవకాశాలు వచ్చిన సంకోచించకుండా నటిస్తా. సినీ జీవితంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవాలని అనుకోవట్లేదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకి పైగా వసూళ్లని సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి : అబద్దాలు చెప్పడం, పొగడడం నా వల్ల కాదు.. స్టార్ హీరో
ఇవి కూడా చదవండి : 'యశోద' మూవీ వచ్చేది అప్పుడే Samantha ట్వీట్..