Fatima Sana Shaikh With Aamir Khan :అమీర్ ఖాన్‌తో డేటింగ్‌పై స్పందించిన సనా..

by sudharani |   ( Updated:2023-05-25 16:13:20.0  )
Fatima Sana Shaikh With Aamir Khan  :అమీర్ ఖాన్‌తో డేటింగ్‌పై స్పందించిన సనా..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఫాతిమా సనా షేక్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. ‘ఇంతకుముందు ఇలాంటి పుకార్లకు నేను ప్రభావితం అయ్యాను. చాలా బాధతో కుమిలిపోయాను. ఎందుకంటే నాకు ఎప్పుడూ అలాంటి వాటితో అనుభవం లేదు. ఇంత పెద్ద స్థాయిలో నాపై ఎవరూ ఆరోపణలు చేయలేదు. నేను ఎన్నడూ కలవని కొంతమంది అపరిచితులు నా గురించి దారుణంగా రాస్తున్నారు. అందులో ఏదైనా నిజం ఉందో లేదో కూడా వారికి తెలియదు. ఇది చదివే వారు నేను మంచి వ్యక్తిని కాదనుకుంటున్నారు. ప్రజలు నన్ను తప్పుగా భావించడం నాకు ఇష్టం లేదు. నిజంగా ఇది నన్ను కలవరపెడుతుంది. నా గురించి బ్యాడ్‌గా అనుకునే వాళ్లంతా తప్పుడు వార్తలు రాసేవారిని అడిగి నన్ను ప్రశ్నించండి’ అని సూచించింది.

ఇవి కూడా చదవండి:

మనువరాలి వయసున్న హీరోయిన్‌ను మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో?

ఉదయం పెళ్లి పెట్టుకుని.. పవన్ కల్యాణ్ సినిమాకు వెళ్లిన మహేశ్ బాబు బావ!

Advertisement

Next Story