మున్ముందు అత్యంత దారుణంగా సమంత పరిస్థితి.. జాతకంలో అసలు ఏముందో తెలుసా?

by Anjali |   ( Updated:2023-09-19 05:49:22.0  )
మున్ముందు అత్యంత దారుణంగా సమంత పరిస్థితి.. జాతకంలో అసలు ఏముందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. సామ్ టాలీవుడ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమని పదేళ్లు కూడా కలిసి జీవించలేదు. దీంతో సామ్‌ను కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇప్పుడు మరోసారి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సమంత జాతకం ప్రకారం.. ఆమెకు అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదని, అమ్మ పిలుపుకు దూరంగానే ఉంటుందని, ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఆ భాగ్యం దక్కే ఛాన్స్ లేదని జనాలు చర్చించుకుంటున్నారు. అలాగే రాబోయే కాలంలో సినీ ఇండస్ట్రీలో డిజాస్టర్ హీరోయిన్‌గా మారిపోతుందని, సినిమాల పరంగా సామ్‌ను ఎవరూ ఆదరించరని’ ఆమె జాతకం చూసినవారు ఈ విధంగా చెబుతున్నారంటూ జనాలు నెట్టింట ముచ్చటిస్తున్నారు.

Read More: సమంతకు మళ్లీ ఏమైంది ఇలా మారిపోయింది.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story