సినిమాలపై Samantha షాకింగ్ డెసిషన్.. షాక్‌లో ఫ్యాన్స్?

by Hamsa |   ( Updated:2022-09-04 04:01:28.0  )
సినిమాలపై Samantha షాకింగ్ డెసిషన్.. షాక్‌లో ఫ్యాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్చా జీవిగా మారిపోయింది. తనకు నచ్చినట్టు ఉంటూ.. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఫ్యాన్స్ అందోళనలో ఉండగా.. సమంత తన సినిమాల విషయంలో మరో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపై తాను నటించే సినిమాలలో ఎలాంటి గ్లామర్ షో లేకుండా.. లిప్ లాక్ సన్నివేశాలు వంటి వాటికి దూరంగా ఉండబోతున్నారని, ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే తాను సినిమాలు చేయడానికి సంతకం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమంత సడన్‌గా సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని షాక్ అవుతున్నారు. సమంతకు ఏమైందని నెట్టింట్లో జోరుగా చర్చించుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Also Read : పెళ్లైన కొద్ది నెలలకే Nayanathara షాకింగ్ డెసిషన్? ఆందోళనలో ఫ్యాన్స్

Advertisement

Next Story