Shaakuntalam Movie OTT Release Date :‘శాకుంతలం’ సినిమా OTT స్ట్రీమింగ్

by Hamsa |
Shaakuntalam Movie OTT Release Date :‘శాకుంతలం’ సినిమా OTT స్ట్రీమింగ్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ కలిసి జంటగా నటించిన చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమాను డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్హ, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 14న ఘనంగా విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ‘శాకుంతలం’ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా, ‘శాకుంతలం’ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త విన్న సామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more:

‘బాయ్ ఫ్రెండ్ లేడు.. ట్రై చేయొచ్చు..’ అంటున్న అనన్యా నాగళ్ల

చిరిగిన ప్యాంటుతో వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన బుట్టబొమ్మ..

Advertisement

Next Story

Most Viewed