సమంత 'Shaakuntalam' ట్రైలర్ రిలీజ్‌ డేట్ ఖరారు

by Hamsa |   ( Updated:2023-01-07 03:54:06.0  )
సమంత Shaakuntalam ట్రైలర్ రిలీజ్‌ డేట్ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేకర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'శాకుంతలం'. ఇందులో సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్నారు. శాకుంతలం నుండి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఫిబ్రవరి 17న 3Dలో పాన్ ఇండియా మూవీగా థియేటర్స్‌లోకి తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ వరుస అప్డేట్స్‌ను వదులుతున్నారు. తాజాగా, ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జనవరి 9న మధ్యాహ్నం 12.06 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అది చూసిన సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story