ఒంటరిగా బతకడం వల్లే జీవితం అంటే ఏంటో అర్థమవుతుందంటూ.. సమంత పోస్ట్ దానికి అర్థం అదేనా?

by Hamsa |   ( Updated:2023-08-24 17:43:24.0  )
ఒంటరిగా బతకడం వల్లే జీవితం అంటే ఏంటో అర్థమవుతుందంటూ.. సమంత పోస్ట్ దానికి అర్థం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల న్యూయార్క్‌లో ‘ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో’ పాల్గొని సందడి చేసింది. అక్కడ పలు ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను గురించి తెలుపుతుంది.

తాజాగా, సమంత తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. మీకు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లే అవకాశం వచ్చినా.. నడిచే అవకాశం వచ్చినా.. ప్రయాణించే అవకాశం వచ్చినా.. బతికే అవకాశం వచ్చినా.. డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినా చేసేయండి. ఈ సమాజం నిన్ను నిన్నులా ఒప్పుకోకపోతే.. అలా ఒంటరిగా ప్రయాణించు.. నిన్ను నువ్వు అన్వేషించుకో.. పక్కన ఎవరైనా ఉన్నప్పుడే తన గురించి తాను తెలుసుకుంటారు.. కానీ మీరు కూడా ఆ కేటగిరీలో ఉండకండి.. కానీ మీకు ఒంటరిగా నడిచే, బతికే అవకాశం వస్తే మాత్రం బతికేయండి.. అప్పుడే మీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది.. తెలుస్తుంది’’ అంటూ ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు సామ్ ఇక పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తుందని ఆ పోస్ట్‌కు అర్ధం అదే అని అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : ఓ వింత సమస్యతో బాధపడుతున్న రణ్‌బీర్‌ కపూర్‌.. దానివల్లే తిన్నా.. మాట్లాడినా..!


Read More : ఆమె వల్ల నరకం అనుభవించా అంటూ.. అక్కినేని అమలపై సమంత షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story