సమంతతో విడిపోయినా.. నాగచైతన్య ఇంట్లో పదిలంగా ఉన్న సమంత గుర్తులు!

by Jakkula Samataha |   ( Updated:2024-03-29 07:35:28.0  )
సమంతతో విడిపోయినా.. నాగచైతన్య ఇంట్లో పదిలంగా ఉన్న సమంత గుర్తులు!
X

దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.ఇక వీరు విడిపోయినప్పటి నుంచి వీరికి సంబంధించిన ఏ వార్తైనా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఇక వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీగా తెలియదు. కానీ తెర మీదకు ఎన్నో గాసిప్స్ పుట్టుకొచ్చాయి. రీసెంట్‌గా ఫోన్ ట్యాపింగ్ వల్లనే వీరు విడిపోయారు అంటూ మరో వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఇక ఇదంతా పక్కన పెడితే సమంత, అక్కినేని నాగచైతన్య విడిపోయినా, అక్కినేని ఫ్యామిలీ సమంత గుర్తులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయంట. చైతూ, సమంతను వివాహం చేసుకున్న తర్వాత వారందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నారంట. అంతే కాకుండా మనం సినిమా సమయంలో కూడా వారు ఫ్యామిలీ ఫొటో దిగి పెద్ద ఫ్రేమ్ చేయించుకొని దానిని ఇంటి ఎంట్రెన్స్‌లో పెట్టారంట. అయితే ఇప్పటికీ ఆ ఫోటో అక్కడే ఉన్నదంట. సమంతతో విడిపోయినా, సామ్ ఉన్న ఆ ఫొటో అక్కినేని ఫ్యామిలీ తొలగించలేదు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఫోటోని తీసేయొచ్చు, కానీ అక్కినేని ఫ్యామిలీఅలా చేయలేదు. ఇప్పటికీ ఎవరైనానాగార్జున ఇంటికి వెళ్తే కచ్చితంగా లివింగ్ రూమ్ లో ఆ ఫోటో చూడాల్సిందే అంటున్నారు నెటిజన్స్.

Read More..

అరియానా గ్లోరీ సూసైడ్ చేసుకుంటోన్న వీడియో వైరల్

Advertisement

Next Story