సమంతకు ఏ వ్యాధి లేదా..? అదంతా నాటకమా..? సింపతి కోసమే డ్రామా ఆడిందా..?

by sudharani |   ( Updated:2023-04-21 13:47:22.0  )
సమంతకు ఏ వ్యాధి లేదా..? అదంతా నాటకమా..? సింపతి కోసమే డ్రామా ఆడిందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత ముఖ్య పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘శాకుంతలం’. పాన్ ఇండియా సినిమా రేంజ్‌లో నిర్మితమైన శాకుంతలం అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో.. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సమంతపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత గత ఏడాది అక్టోబర్‌లో మయోసైటీస్ సోకినట్లు ప్రకటించారు. చికిత్స తీసుకుంటున్నట్లు బెడ్‌పై ఉన్న ఫొటో ఒకటి షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో పెద్ద నోట్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే.. యశోద సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు భయంకరమైన వ్యాధి ఉందని సమంత చెప్పడం జరిగింది. ఆ సింపతితోనే యశోద సినిమా హిట్ అయిందని.. ఇప్పుడు అదే సింపతితో శాకుంతలం ప్రమోట్ చేశారని కానీ, ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలిందని వార్తలు వస్తున్నాయి. సమంత తన చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకే అనారోగ్యం అనే నాటకం ఆడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఆమె ప్రవర్తించే తీరు అంటున్నారు విమర్శకులు. అసలు విషయం ఏంటంటే..

సమంత నటించిన గత రెండు సినిమాలు యశోద, శాకుంతలంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలు హిట్ కొట్టాలనే సింపతి డ్రామ ప్లే చేసిందని పలువురి అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగా ఆమెకు అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ అది చెప్పుకునేంతా పెద్దది కాదని వాళ్ల అభిప్రాయం. సమంత గత ఏడాది అక్టోబర్‌లో మయోసైటీస్ సోకినట్లు ప్రకటించారు. యశోద సినిమా వారం రోజుల ముందు నాకు భయంకరమైన వ్యాధి ఉందని చెప్పడం.. ఆ సినిమా హిట్‌కు కారణమని అంటున్నారు విమర్శకులు. అదే సింపతి ప్లాన్ శాకుంతలం సినిమా రిలీజ్ ముందు కూడా ప్లే చేశారంటూ విమర్శిస్తున్నారు. అంతే కాకుండా ప్రమోషన్స్‌లో కనీసం ఓపిక కూడా లేదంటూ మీడియా ముందు తన అనారోగ్య పరిస్థితిని బయటపెట్టింది. నాకు హెల్త్ ఇంకా సెట్ కాలేదు.. కానీ శాకుంతలం మీద ఇష్టంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సినిమా విడుదలకు ముందు సమంత తనకు జ్వరం సోకినట్లు.. ఇకపై ప్రమోషన్స్‌లో పాల్గొన లేనని చెప్పింది.

కానీ, కట్ చేస్తే సమంత విదేశాల్లో తేలింది. అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. కట్టు బోట్టు మార్చేశారు. అద్భుతమైన లుక్‌లో దర్శనమిచ్చి మైండ్ బ్లాక్ చేసింది. దీంతో వారం రోజుల క్రితం జ్వరం అని ప్రకటించిన సమంత విదేశాలు ఎలా వెళ్లింది అంటూ పలువురు తప్పు పడుతున్నారు. ఈ అనారోగ్య కథలన్నీ సినిమా ప్రమోషన్స్‌ కోసమే అంటూ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇంత కష్టపడి చేసిన శాకుంతలం సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు కానీ... సమంత వీటిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Also Read...

సమంత ధరించిన డైమండ్ నెక్లస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisement

Next Story