Samantha Ruth Prabhu Birthday: ‘ఖుషీ’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

by Hamsa |   ( Updated:2023-04-28 09:08:33.0  )
Samantha Ruth Prabhu Birthday: ‘ఖుషీ’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందిస్తున్నాడు. ఖుషీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. సమంతకు మయోసైటీస్ రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని సమంత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ రోజు సమంత పుట్టిన రోజు సందర్భంగా విష్ చేస్తూ ‘ఖుషీ’ సినిమాలో సామ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో సమంత సింపుల్ కాలేజీ అమ్మాయిలా ఐడి కార్డ్ వేసుకుని ఉంది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story