సమంత తన పుట్టిన రోజు ఏ దేశంలో జరుపుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Disha Web Desk 8 |
సమంత తన పుట్టిన రోజు ఏ దేశంలో జరుపుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ రావడంతో.. స్టార్ హీరోస్ అందరి సరసన నటించి, స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్‌ల వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని లక్కీ గర్ల్‌గా మారిపోయింది.

ఇక మయోసైటీస్ వ్యాధి బారినపడిన సమంత కొన్నిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది. అంతే కాకుండా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో సమంతకు అవకాశం వచ్చినట్లు కూడా సమాచారం. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు.. ఈరోజు సామ్ గ్రీస్ దేశానికి వెళ్లి తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందంట. గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో సమంత తాను తిరిగిన ప్రదేశాలు, తన బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సమంత తన పుట్టిన రోజు నాడు తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ఆసక్తికర టైటిల్ రివీల్ చేసిన విషక్ష్ం తెలిసిందే. ఈ సినిమాను ఆమె తెరకెక్కిస్తుండటంతో సర్వాత్ర ఆసక్తినెలకొంది.

Read More..

నారా బ్రహ్మణిని మహేష్ బాబు రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!

Next Story

Most Viewed