సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత?

by samatah |   ( Updated:2023-07-05 06:16:15.0  )
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు, తర్వాత వరస సినిమాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోల అందరి సరసన నటించి, తన నటనతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా సరే సమంత క్రేజే వేరుటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి సమంత త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సామ్ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఫైనల్‌కు వచ్చేసింది. మరో రెండు, మూడు రోజుల్లో, షూటింగ్ పూర్తి కానుందని, ఆ తర్వాత సామ్ మూవీస్‌కు గుడ్ బై చెప్పి ఏడాది పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక సమంత గతేడాది మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ అమ్మడు కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి వరసగా సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు సామ్ పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టిపెట్టాలని నిర్ణయించుకుందంట. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Read more: విడాకులు తీసుకున్న మెడలో నల్లపూసలు ధరిస్తున్న సమంత.. కారణం అదేనా?

ప్రేమ విషయంలో నేను కొంతమంది వల్ల మోసపోయానంటున్న.. షెహనాజ్ గిల్

Advertisement

Next Story