- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండస్ట్రీలో దుమారం రేపుతోన్న వార్త.. నాగచైతన్య గురించి వారితో చర్చించిన సమంత!!
దిశ, సినిమా: గత ఏడాది నుంచి హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రెస్ట్ తీసుకుంటోంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సమంత ఫ్యాన్స్‌తో తరచూ టచ్‌లోనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటని అడగ్గా.. దీనికి సామ్ బదులిస్తూ.. ‘జీవితంలో నేను చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే.. నా సొంత ఇష్టాలను, అయిష్టాలను అర్థం చేసుకోవడంలో నేను విఫలయ్యాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నాతో ఉన్న భాగస్వామి ద్వారా ఎప్పుడు ప్రభావితమయ్యాను.
నేను కష్టాల్లో ఉన్నప్పుడు అర్థమైంది. నేను నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఇంకా ఉందని. నేను గుర్తించిన ఈ విషయం నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా విలువైనదని తెలుసుకున్నాను” అంటూ సామ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ స్క్రీన్ షార్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. మాజీ భర్త నాగచైతన్యను ఉద్దేశించే ఈ విధంగా మాట్లాడిందంటూ జనాలు చర్చించుకుంటున్నారు. పలువురు అక్కినేని ఫ్యాన్స్.. ఇంకా చైతన్యను మర్చిపోలేక సమంత అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది వెటకారపు కామెంట్లు పెట్టగా.. మరికొంతమంది వీరిద్దరు మళ్లీ కలిస్తే బాగుండని భావిస్తున్నారు.