- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: స్టార్ హీరోలకు ధీటుగా సమంత.. ఆ విషయంలో తగ్గేదే లేదంట?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తన నటనతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక మయోసైటీస్‌తో కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా తర్వాత వరస ఆఫర్లతో దూసుకెళ్తుంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఏదీ తేడా లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. బీజీ అయిపోయింది.
ఇక తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత మరోవైపు, పలు ఇంటర్నేషనల్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే తాను తాజాగా టామీ హిల్ ఫిగర్ యాడ్ లో నటించినది. ఇకపోతే ఈ యాడ్లో సమంత కాస్త బొద్దుగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇంటర్రేషనల్ బ్రాండ్‌కు ప్రమోటర్‌గా మారడంతో, సామ్ భారీగా రెమ్యురేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఒక యాడ్ కోసం ఏకంగా,3 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుందంట.అంటే స్టార్ హీరోలు కూడా యాడ్స్ కోసం ఈ రేంజ్ లోనే పారితోషకం తీసుకుంటున్నారు. ఇప్పుడు వారికి దీటుగా తనకు ఉన్న నేషనల్ వైడ్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటోంది. అంతే కాకుండా సామ్, హాలీవుడ్, బాలీవుడ్‌లో వరస ఆఫర్స్ అందుకుంటూ, గ్లోబల్ స్టార్‌గా మారడానికి ప్రయత్నం చేస్తోందని సమాచారం.
Also Read: Leo first-look poster released : విజయ్ దళపతి బర్త్ డే స్పెషల్