మెగాస్టార్‌తో జతకట్టనున్న సమంత.. ఆనందంలో ఫ్యాన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-06-13 07:54:14.0  )
మెగాస్టార్‌తో జతకట్టనున్న సమంత.. ఆనందంలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : సమంత అభిమానులకు తీపి కబురు అందింది. విడాకులు, మయోసైటీస్ వీటన్నింటి నుంచి బయటపడటానికి సమంత ఓ యుద్ధమే చేసిందని చెప్పాలి. ఈ బ్యూటీ దీని కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చి కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా తన స్నేహితులతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేసింది. ఇక కాస్త ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఈ ముద్దుగుమ్మ మళ్లీ వెండితెరపై మెరవడానికి రెడీ అయ్యింది. సామ్ ఏ ప్రాజెక్ట్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌లో వెండి తెర మీదకు వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్‌ సరసన నటించడానికి సామ్ ఒకే చెప్పింది. అలాగే రామ్ చరణ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ అవకాశం దక్కించుకుంది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అనేది ఏమీ లేదు. ఇక త్వరలోనే సామ్ ఏదో ఒక అప్డేట్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తుందని వారు ఎదురు చూశారు. కానీ రీసెంట్‌గా ఈ బ్యూటీ ఆశ్రమంలో దర్శనం ఇవ్వడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి, సమంతకు మళ్లీ ఎదో అనారోగ్య సమస్య వచ్చినట్లు ఉంది. ఇక సామ్ ఇప్పట్లో సినిమాల్లో నటించేలా లేదు అని ఫిక్స్ అయిపోయారు.

కానీ ప్రస్తుతం ఓ వార్త వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది ఏమిటంటే? మెగాస్టార్‌తో జతకట్టడానికి రెడీ అయ్యింది ఈముద్దుగుమ్మ. మలయాళీ మెగాస్టార్ ముమ్మట్టి హీరోగా తెరకెక్కుతున్న ఓ సీనిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్. అయితే ఏ మాయ చేశావే సినిమాతో తనకు మంచి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ కోరిక మేరకు సమంత ఈ సినిమాలో చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి సారి సమంత మలయాళంలో నటించనుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఇదే నిజం అయితే సమంత మలయాళంలోనే కాదు, టాలీవుడ్‌లో కూడా బిజీ అవుతుందని అంటున్నారు తమ అభిమానులు.

Advertisement

Next Story