ఎంత ప్రేమించినా సరిపోదు అంటూ విజయ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన సమంత.. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-08-17 05:39:54.0  )
ఎంత ప్రేమించినా సరిపోదు అంటూ విజయ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన సమంత.. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. దీనిని డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో సమంత, విజయ్ దేవరకొండ కలిసి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఖుషి మ్యూజిక్ ఈవెంట్‌లో మెస్మరైజింక్ డాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

తాజాగా, సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. విజయ్‌తో కలిసి రొమాంటిక్‌గా దిగిన ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ఎంత ప్రేమించినా సరిపోదు’’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ కూడా జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ‘ఇది చూస్తుంటే మూవీ ప్రమోషన్‌లా లేదు వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఆ ఫొటోలు ప్రీ వెడ్డింగ్‌కు చేసుకున్నట్లు అనిపిస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed