కొత్త ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన Samantha.. రూల్స్ ఇవే అంటూ షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-08-20 18:04:37.0  )
కొత్త ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన Samantha.. రూల్స్ ఇవే అంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒక్కరిగా కొనసాగుతున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల ఖుషి సినిమా మ్యూజిక్ ఈవెంట్‌లో సామ్ పాల్గొని రౌడీ హీరోతో రొమాంటిక్ డాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను గురించి తెలుపుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, సమంత తన కొత్త ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించింది. ‘‘ మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమను కనుగొన్నా. కొత్త నిబంధనలు కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి’’ అంటూ మూడు లవ్ ఎమోజీలను జత చేసింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి : అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు: శ్రీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


Advertisement

Next Story

Most Viewed