ఆ స్టార్ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్న సమంత.. ఏ సినిమాలో అంటే?

by Hamsa |   ( Updated:2023-06-01 07:10:58.0  )
ఆ స్టార్ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్న సమంత.. ఏ సినిమాలో అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సామ్, విజయ్ దేవరకొండ హీరోగా ‘ఖుషి’ లో నటిస్తోంది. బాలీవుడ్‌లో దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ‘సీటాడెల్’ వెబ్ సిరీస్‌లోనూ ఫీమేల్ లీడ్‌గా చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ‘సీటాడెల్’ వెబ్‌సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్ ప్రియాంక చోప్రాకు తల్లిదండ్రులుగా నటిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఇంగ్లీష్ ‘సీటాడెల్’ చివరి ఎపిసోడ్‌లో రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక సీటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ ఐదో ఎపిసోడ్ లో ప్రియాంక చోప్రా యొక్క తండ్రి పాత్రకు వరుణ్ డబ్బింగ్ చెప్పాడని తెలుస్తోంది. దీంతో వరుణ్ ధావన్, సమంత ప్రియాంకకు తల్లిదండ్రులుగా నటిస్తున్నారనే రూమర్స్ జోరందుకున్నాయి. దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. మొత్తానికి ఈ రెండింటికీ లింక్ పెడుతూ వస్తున్న వార్తల వల్ల సమంత సిరీస్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Also Read: మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్ సాంగ్ కాపీ చేసి.. మహేష్ ‘గుంటూర్ కారం’కి బీజీఎం.. థమన్‌పై నెటిజన్ల ఫైర్

పెళ్లికి అవి చాలా ముఖ్యం.. వాటికి నేను రెడీగా లేను..! హీరోయిన్ పోస్ట్ వైరల్

డబ్బుకోసం సమంత అంత పని చేస్తోందా?

Advertisement

Next Story