- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభిమానులపై అలాంటి వ్యాఖ్యలు చేసిన సమంత..కామెంట్స్ వైరల్
దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటీస్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టి అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది. అందులో ఆరోగ్యంతో పాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా తాను కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతానని పేర్కొంది. ఇక తన బాల్యం గురించి కూడా మాట్లాడింది. తన చిన్నతనం నుంచే జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో తరచూ విజయంపై ఫోకస్ పెట్టానని చెప్పింది. అయితే ఆ లక్ష్యమే తనని గెలుపు సాధించడానికి తోడ్పడిందని తెలిపింది.
తాజాగా తన అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని అందులోను తన మాటను గౌరవించే అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక తన అభిమానుల్లో చాలామందికి వినోదం, ఫ్యాషన్, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని.. వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, కొత్త అంశాలపై అవగాహన వచ్చినట్లు తెలిపింది.
వీటి ద్వారా కొంతమంది లో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అంటూ చెప్పుకొచ్చింది.