- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీటాడెల్ షూటింగ్లో సమంతకు అస్వస్థత.. సృహ తప్పి పడిపోవడంతో!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. మయోసైటీస్ వ్యాధి రావడంతో పూర్తిగా అన్నింటికీ దూరమై ఇంట్లోని ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సామ్ ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుంటూ మళ్లీ యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయింది. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండకుండా.. ఓ హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి అందులో పలు ఆసక్తికర విషయాలను తెలుపుతుంది.
అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ మరింత గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. తాజాగా, సమంత తన పాడ్ కాస్ట్లో తనకు ఎదురైన ఓ అనుభవం తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా న్యూట్రీషనిస్ట్ అల్కేశ్తో పలు విషయాలు పంచుకుంది. ‘‘ మయోసైటీస్ వ్యాధి వచ్చినప్పుడు వారంలో తగ్గుతుందని అనుకున్నాను. అలాగే నాకే ఎందుకు వచ్చిందని బాధపడ్డాను. ఏడాదిన్నరగా ఈ వ్యాధితో పోరాడుతున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. కానీ దృఢంగా ఉంటే దేనినైనా సాధించగలం అని నిర్ణయించుకుని ధైర్యంగా పోరాడుతున్నా.
ఈ సమస్యల నుంచి కోలుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నా ఇప్పటికీ వాటినే పాటిస్తున్నాను. అలాగే సినిమాలకు బ్రేక్ ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఆరోగ్యం పరంగా చాలా హెల్త్ అయింది. అయితే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేశాక వెంటనే సిటాడెల్ వెబ్ సిరీస్‌కు సైన్ చేశాను. దీంతో షూటింగ్లో పాల్గొంటున్న సమయంలోనే కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తుండగా నొప్పులు తిమ్మిరి వచ్చాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో సృహ తప్పి అక్కడే పడిపోయాను. ఒక్కసారిగా షూట్ అంతా అప్సెట్ అయింది. మా టీమ్ వారు డాక్టర్‌కు కాల్ చేసి రప్పించి ట్రీట్’మెంట్ చేయించారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి షూటింగ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు సిటాడెల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.