- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లండన్ అబ్బాయితో ప్రేమలో పడిన సమంత.. ఒకే చెప్పేసింది నిజమేనా?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన అందం నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై, తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. విడాకులు తీసుకొని వారి వారి కెరీర్ పై దృష్టి పెట్టారు.
విడాకుల తర్వాత మానసికంగా చాలా కృంగిపోయిన సమంత, మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలపై ఎక్కువ ఫొకస్ పెట్టినట్లు తెలుస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఎందులో ఏ అవకాశం వచ్చినా ఇట్టే పట్టేసుకుంటుంది. ప్రతీ సినిమాకు సైన్ చేస్తూ పోతుంది. బారీ బడ్జెట్ తో విడుదలైన శాకుంతలం మూవీ నిరాశ కలిగించినా ఈ అమ్మడు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ పై ఎక్కువ ఫొకస్ చేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో వెబ్ సీరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆమె ఓ సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
వివేక్ కాల్రా హీరోగా.. హాలీవుడ్ లో సమంత నటించే సినిమాలో హీరో లండన్ కు చెందిన అబ్బాయి అంట. హీరోయిన్ సమంత చెన్నైకి చెందిన అమ్మాయి అంట. ఈ లండన్ అబ్బాయి ఆ చెన్నై అమ్మాయిని ప్రేమిస్తాడు అంట. ఆ ప్రేమ ఎలా మొదలవుతుంది, చివరకి ఏం జరుగుతుంది అనేది సినిమా అంట.
మొత్తం మీద హాలీవుడ్ లో కూడా మంచి లవ్ స్టోరీ తో సమంత ఎంటర్ అవ్వడం అంటే నిజంగా గ్రేట్. అందుకే లండన్ అబ్బాయితో ప్రేమకి ఒకే చెప్తూ.. సంతకం పెట్టేసింది అంట. ఈ వార్తలో ఎంత నిజమందో తెలియదు కానీ, శాకుంతలం డిజాస్టర్ తో అందరూ అవమానిస్తుంటే,కృంగిపోకుండా,హాలీవుడ్ లో ఇండియన్ లవ్ స్టోరీ నటించే సినిమా లెవల్ కి వెళ్ళనటూ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చింది కదా అని అనుకుంటున్నారు.
Also Read... ‘గాంఢీవధారి అర్జున’ నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్