Samantha: 'సిటాడెల్' ప్రమోషన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత - నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

by Kavitha |
Samantha: సిటాడెల్ ప్రమోషన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత - నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంత కాలంగా మయోసైటీస్ వ్యాధి వల్ల సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం గతంలో పెండింగ్ పెట్టిన మూవీస్‌ను కంప్లీట్ చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే సమంత - వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'సిటాడెల్ : హనీ బన్నీ' ఒకటి. ఈ సినిమాకు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా.. నవంబర్ 27నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక తాజాగా సిటాడెల్‌ టీజర్‌ను కూడా లాంచ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మూవీ టీం వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా అయిపోయింది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా సమంత వరుణ్‌ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అవి ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది. అందులో బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా సమంత చాలా స్టైలిష్‌గా వరుణ్‌ ధావన్‌తో నవ్వుతూ కాస్తా క్లోజ్‌గా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఫుల్ బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఈ అమ్మడు చాలా క్యూట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు 'క్వీన్‌ ఇన్‌ క్వీనింగ్‌' అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేయండి.

(video link credits to samantha instagram id)

Advertisement

Next Story

Most Viewed