మళ్లీ హాట్ టాపిక్‌గా మారిన శోభిత, సమంత, నాగచైతన్య..! ఆ పోస్ట్‌తో వైరల్

by sudharani |   ( Updated:2023-11-01 10:31:09.0  )
మళ్లీ హాట్ టాపిక్‌గా మారిన శోభిత, సమంత, నాగచైతన్య..! ఆ పోస్ట్‌తో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గూఢచారి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభిత ధూళిపాళ. తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. నాగచైతన్య, శోభిత ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సమంత, నాగచైతన్య ఇద్దరు విడిపోవడానికి కూడా కారణం శోభితానే అని నెట్టింట న్యూస్ చక్కర్లు కొట్టాయ్. అయితే.. వాటిపై స్పందించిన శోభిత ఇవన్నీ నిజాలు కాదని కొట్టిపడేసింది. ఇక ప్రస్తుతం రూమర్స్ అన్ని సైలెంట్ అయిపోయిన క్రమంలో మరోసారి వార్తల్లో నిలిచారు ఈ ముగ్గురు. విషయం ఏంటంటే..

తాజాగా ముంబైలో జరిగిన మామి లాంచ్ ఈవెంట్‌కు హాజరైన శోభిత.. అక్కడ బంగారు రంగు చీరలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే.. ఈ ఫొటోలకు నాగచైతన్య, సమంత ఇద్దరు లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా సమంత ఫాలోయింగ్‌లో శోభిత ఉంది కానీ.. శోభిత ఫాలోయింగ్‌లో సమంత లేదు. దీంతో ఈ న్యూస్ మరింత వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.


Advertisement

Next Story

Most Viewed