‘సలార్’ టీజర్ రిలీజ్.. ఆ రోజే మంచి ముహూర్తం.. ధోనీతో ప్లాన్..

by Anjali |   ( Updated:2023-06-20 13:07:31.0  )
‘సలార్’ టీజర్ రిలీజ్.. ఆ రోజే మంచి ముహూర్తం.. ధోనీతో ప్లాన్..
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ‘సలార్’ టీజర్ రిలీజ్ అప్‌డేట్ గురించి చర్చ జరుగుతోంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. టీజర్ గురించి వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ జూలై 7న ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అదే రోజు క్రికెటర్ ధోనీ బర్త్ డే కావడంతో అతని చేతుల మీదుగా విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. అలా చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని.. కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు.

Read more: మహేష్ బాబు వేధించడంతో ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకున్న పూజా.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

Advertisement

Next Story