యువరాజ్ సింగ్ ఇన్‌స్పిరేషన్‌తోనే ఈ సినిమా ఒప్పుకున్నా.. Saiyami Kher

by Anjali |   ( Updated:2023-08-17 13:47:44.0  )
యువరాజ్ సింగ్ ఇన్‌స్పిరేషన్‌తోనే ఈ సినిమా ఒప్పుకున్నా.. Saiyami Kher
X

దిశ, సినిమా : ‘ఘూమర్‌’లో తను పోషించిన పాత్ర కోసం ఇండియన్ క్రికెటర్ యువరాజ్ నుంచి ప్రేరణ పొందినట్లు సయామీ ఖేర్ వెల్లడించింది. ఎడమ చేతితో రెండు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న దివంగత హంగేరియన్ కరోలీ టకాక్స్ లైఫ్ స్టోరీ ఆధారంగా వస్తున్న ఈ మూవీలో.. ఒక చేయి కోల్పోయిన పారా అథ్లెట్‌ క్రికెట్ క్రీడాకారిణిగా సయామీ నటిస్తుండగా అభిషేక్ బచ్చన్ కోచ్‌గా కనిపించనున్నారు. కాగా ఆగస్టు 18న రిలీజ్ కాబోతున్న సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడిన నటి.. ‘ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడానికి యువరాజ్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకున్నా. యువరాజ్ జీవితం నాకే కాదు నాలాంటి చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. కెరీర్‌ పీక్‌లో ఉన్నపుడు క్యాన్సర్‌ బారిన పడి మళ్లీ ఆటలోకి తిరిగి రావడం అతని మానసిక దృఢత్వాన్ని తెలియజేస్తుంది. యువీకి క్రికెట్‌పై ఉన్న ప్రేమ నాకు తెలుసు’ అని చెప్పింది. అలాగే ఇప్పటివరకు తాను చేసిన మోస్ట్ చాలెంజింగ్ రోల్ ఇదేనని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed