ఆ సినిమా చేస్తున్నపుడు మానసికంగా కుంగిపోయా: Saiyami Kher

by Hamsa |   ( Updated:2022-12-05 07:27:28.0  )
ఆ సినిమా చేస్తున్నపుడు మానసికంగా కుంగిపోయా: Saiyami Kher
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయామీ ఖేర్ 'ఘూమర్'లో వికలాంగ క్రికెటర్‌గా నటించడంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సినిమాలో తన అభిమాన హీరో అభిషేక్ బచ్చన్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. 'నేను ప్రొఫెషనల్ క్రికెటర్‌ అవ్వాలని కలలు కన్నాను. కానీ నిజ జీవితంలో అది సాధించలేకపోయాను. 'ఘూమర్' నాకు ఆ అవకాశం ఇచ్చింది. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే పాత్ర ఇది. వికలాంగ క్రికెటర్‌గా నటించేందుకు శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. ఒక దశలో ఒత్తిడితో కుంగిపోయినప్పటికీ మళ్లీ ఎంతో ఇష్టపడి పనిచేశా. దర్శకుడు బాల్కీ సార్ చాలా తెలివైనవాడు. సింపుల్‌గా ఉంటూనే సెట్‌లో ఎనర్జీ నింపుతాడు. వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమె నటించిన రీసెంట్‌ మూవీ 'ఫాదు-ఎ లవ్ స్టోరీ' డిసెంబర్ 9న సోనీ లివ్‌లో ప్రీమియర్‌ కానుంది.

Read more:

ఆయన బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేదు: క్లారిటీ ఇచ్చిన దర్శకురాలు

Advertisement

Next Story

Most Viewed