సినిమాలలో స్కిన్ షో ప్రదర్శించని Sai Pallavi.. కారణం ఇదేనా ?

by samatah |   ( Updated:2022-06-13 09:28:41.0  )
సినిమాలలో స్కిన్ షో ప్రదర్శించని Sai Pallavi.. కారణం ఇదేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ యంగ్ బ్యూటీ ఆలస్యంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా ఆమెను జనాలు లేడీ సూపర్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న స్టార్ డమ్ అలాంటిది. సినిమాల్లో ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఈ అమ్మడుకు ఇంత పెద్ద ఫాలోయింగ్ వచ్చిందంటే అది ఆమె పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ ద్వారానే అని చెప్పవచ్చు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎప్పుడూ సినిమాలలో పద్ధతిగా కనిపించే బ్యూటీ స్క్రీన్‌పై, తాను ఎందుకు చిన్నపాటి దుస్తులను ధరించదు అనే విషయాన్ని తెలిపింది. తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పింది. అంతే కాకుండా తనకు ఒక చెల్లెలు ఉంది. మేము ఇద్దరం ఇంట్లో టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడుతాము. గేమ్ ఆడుతున్నప్పుడు మాకు ఫ్రీగా అనిపించే దుస్తులు ధరిస్తామన్నది.

కానీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత, ఒక చిన్న సంఘటన నన్ను సినిమాల్లో పొట్టి డ్రెస్‌లు ధరించకుండా చేసిందని పేర్కొంది. నేను నా విద్యాభ్యాసాలను కొనసాగించడానికి జార్జియా వెళ్ళినప్పుడు, నేను టాంగో డ్యాన్స్ నేర్చుకున్నాను. టాంగో డ్యాన్స్ నేర్చుకోవడానికి అక్కడ ప్రత్యేక దుస్తులు ధరించాలి. దీంతో నేను ఆ విషయాన్ని మా అమ్మనాన్నలకు చెప్పి వారి అనుమతితో కంఫర్ట్‌లేని దుస్తులను వేసుకున్నాను అని పల్లవి పేర్కొంది.

ఇక కొన్ని నెలల తర్వాత ప్రేమమ్‌లో నటించే అవకాశం వచ్చింది. సినిమా విడుదలైన తర్వాత నా టాంగో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు చేసిన కామెంట్స్ నాకు కొంత బాధను కలిగించాయి. దీంతో సినిమాల్లో చిట్టిపొట్టి దుస్తులను ధరించకూడదని నిర్ణయించుకున్నాను అని సాయిపల్లవి తెలిపింది. కాగా ఈ ముద్దుగుమ్మ తదుపరి చిత్రం విరాట పర్వం. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed