- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kareena Kapoor కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సైఫ్.. అటిట్యూడ్ మార్చుకోవాలంటూ
దిశ, సినిమా: ‘జానే జాన్’ సినిమా కోసం విజయ్, జైదీప్‌లతో కలిసి పని చేస్తున్నప్పుడు తన అటిట్యూడ్ మార్చుకోమని భర్త సైఫ్ అలీఖాన్ హెచ్చరించినట్లు తెలిపింది కరీనా కపూర్. ఈ మేరకు సుజోయ్ ఘోష్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కరీన మాట్లాడుతూ.. ‘విజయ్, జైదీప్‌ల పక్కన నటిస్తున్నపుడు మరింత యాక్టివ్‌గా ఉండాలని సైఫ్ కోరాడు. వాళ్ల పనితీరు, టాలెంట్‌ను గమనిస్తూ పోటీపడాలని చెప్పాడు. లేదంటే నెగెటీవ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించాడు. ప్రతి సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని, దేనికి వెనకడుగు వేయొద్దన్నాడు. వాళ్లతో స్ర్కీన్ షేర్ చేసుకోవడమంటే విహారయాత్ర కాదు. విద్యార్థిలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నాడు. బ్యాక్ బెంచర్‌గా ఆలోచించొద్దని వార్నింగ్ ఇచ్చాడు’ అని తెలిపింది. అలాగే మూవీలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. ‘అందరితోపాటు ట్రైలర్ చూడాలని నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఫస్ట్ టైమ్ ఒక క్రైమ్ థ్రిల్లర్‌లో నన్ను కొత్త కోణంలో చూడబోతున్నారు’ అని చెప్పింది. ఇక సెప్టెంబర్ 21న కరీన 43వ బర్త్ డే సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ ప్రసారంకానుంది.
ఇవి కూడా చదవండి: ‘సలార్’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్