ఒళ్ళో పాపతో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. నెట్టింట ఫొటోలు వైరల్!

by Hamsa |   ( Updated:2024-04-08 18:21:52.0  )
ఒళ్ళో పాపతో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. నెట్టింట ఫొటోలు వైరల్!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రేమమ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఫిదా మూవీతో హిట్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత లవ్ స్టోరీ, ఎమ్‌సీఎ, విరాటపర్వం వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘తండేల్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బన్నీ వాసు, నిర్మిస్తున్నారు. అయితే తండేల్‌లో నాగచైతన్య ఫిషర్ మెన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది.

రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్‌లో షూట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, తండేల్ షూటింగ్ నుంచి నిర్మాణ సంస్థ పలు ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా తొందరలోనే అప్డేట్ ఇస్తామని కూడా రాసుకొచ్చారు. అయితే ఈ ఫొటోల్లో నాగచైతన్య, అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ చందూ మొండేటి సాయిపల్లవి ఉన్నారు. ముఖ్యంగా సాయి పల్లవి ఓ పాపను ఒళ్లో కూర్చోపెట్టుకుని నవ్వుతున్న ఫొటో అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో ఫ్యాన్స్ ఆ పిక్‌ను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తు్న్నారు.

Advertisement

Next Story

Most Viewed