- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షూటింగ్ సమయంలో పీరియడ్స్ వచ్చి విపరీతమైన కడుపు నొప్పితో ఆ పని చేసాను : సాయి పల్లవి
దిశ,సినిమా : సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయిన అద్భుతమైన నటన, డ్యాన్స్ తో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ టాలెంటెడ్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ అమ్మడు అందరి హీరోయిన్స్ లా కథ చెప్పిన వెంటనే ఓకే చేయదు. స్టోరీలో తన పాత్ర నచ్చితే తప్ప చేయదనే టాక్ ఇప్పటికి ఇండస్ట్రీలో ఉంది.
రణ్బీర్ కపూర్ హీరోగా రామాయాణం మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్లో కూడా అడుగు పెట్టబోతోంది. ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్గా అవుతున్నాయి. షూటింగ్ సమయంలో పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు అని అడగగా.. తాజాగా దీనిపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది.
" పీరియడ్స్ టైం లో షూట్ అంటే కష్టమే పైగా డ్యాన్స్ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. కొన్ని సినిమాల్లో పీరియడ్స్ సమయంలోనే నేను డ్యాన్స్ చేశాను. కొన్నిసార్లు సమస్యలను కూడా పక్కన పెట్టి పని చేయాలి ఆ సమయంలో వేరే ఆప్షన్ ఉండదు. శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా నెలసరి సమయంలోనే చేశా.. ఆ టైం లో నాకు విపరీతమైన కడుపు నొప్పి.. అయినా ఆ సాంగ్ పూర్తి చేశానని" సాయి పల్లవి తెలిపింది.