‘మీటూ’పై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది కూడా వేధింపేనంటూ

by sudharani |   ( Updated:2023-03-09 09:54:42.0  )
‘మీటూ’పై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది కూడా వేధింపేనంటూ
X

దిశ, సినిమా: ‘మీటూ’ ఉద్యమంపై స్టార్ నటి సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ సింగర్ స్మిత టాక్ షో ‘నిజం విత్ స్మిత’లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఎంతోమంది గళమెత్తారు. అయితే ఎవరైనా చేతలతోనే కాదు మాటలతో ఎదుటివ్యక్తికి ఇబ్బంది కలిగించేలా చేసినా అది వేధింపులతో సమానమే. అందరిలాగే నాకు కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా బలమైన సంల్పంతో ముందుకెళుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తారక్, బన్నీ, చెర్రీ ఈ ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతావని అడగగా.. ‘ఆ ముగ్గురు నాతో ఒక పాట చేస్తే బాగుంటుంది’ అని తన ఫీలింగ్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి : దానికోసమే ప్రతిరోజూ పోరాటం చేస్తున్నా: రష్మిక

Advertisement

Next Story