'పుష్ప 2' లో Sai Pallavi పాత్రలో మరో హీరోయిన్ ప్లాన్

by Prasanna |
పుష్ప 2 లో Sai Pallavi పాత్రలో మరో హీరోయిన్ ప్లాన్
X

దిశ, సినిమా: స్లయిలిష్ స్టార్ అల్లు అర్జున్..డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక మంచి ఎఫెక్ట్‌తో 'పుష్ప 2'‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. నాచురల్ బ్యూటీ సాయిపల్లవి 'పుష్ప 2' లో, కీలక పాత్రలో నటించనున్నట్టు కొద్ది రోజులు నుంచి టాక్ వినిపిస్తుంది. ఓ గిరిజన అమ్మాయి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. పూర్తి డీగ్లామర్ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించగలదని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఈ పాత్రలో సాయిపల్లవి కచ్చితంగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందట. అయితే అల్లు అర్జున్, సాయి పల్లవి మధ్య దాదాపు 20 నిమిషాల రన్ టైమ్ సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. కానీ దీనిపై సాయి పల్లవి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అప్‌డేట్ ఏమిటంటే..ఒకవేళ సాయిపల్లవి ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తే..ఈ పాత్ర కోసం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‏ను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్..చూడాలి మరి ఎవరు ఓకే అవుతారో.

Also Read..

చరిత్రకు అతి చేరువలో RRR 'Natu Natu ' పాట

Advertisement

Next Story

Most Viewed